Page Loader
Union Budget: బడ్జెట్‌లో రైల్వేల ఆశలెన్నో.. మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుందా..
బడ్జెట్‌లో రైల్వేల ఆశలెన్నో.. మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుందా..

Union Budget: బడ్జెట్‌లో రైల్వేల ఆశలెన్నో.. మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుందా..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా తీర్చిదిద్దాలంటే ప్రస్తుత వేగం సరిపోతుందా? లేక ఇంకా వేగంగా ముందుకు సాగాలా? మౌలిక వసతుల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు, ఇంకా ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో,ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైల్వే రంగానికి ఎలాంటి ప్రణాళికలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అధునాతన రైళ్లు, మౌలిక వసతుల విస్తరణ, సరకు రవాణా కారిడార్ల అభివృద్ధి,దేశీయంగా తయారీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

మూలధన పెట్టుబడి - కీలక అంశం 

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా రైల్వేలను అభివృద్ధి చేయాలంటే బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు ఉండాలని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రైల్వేలకు మూలధన పెట్టుబడి ముఖ్యమైనది. మొత్తం బడ్జెట్‌లో దాదాపు 40% ఈ పెట్టుబడికే కేటాయించబడుతోంది. రానున్న బడ్జెట్‌లో అధునాతనీకరణ, భద్రత, విస్తరణ కోసం మరింత నిధులు వెచ్చించనుందని అంచనా. గత ఐదేళ్లలో మూలధన పెట్టుబడి 77% పెరిగినప్పటికీ, ప్రాజెక్టులకు సరిపడా నిధులు సమకూరలేదు. 2020-25 నాటికి జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (NIP) ద్వారా రూ.13.6 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు దాదాపు రూ.9.59 లక్షల కోట్లు మాత్రమే వినియోగించబడ్డాయి.

వివరాలు 

సరుకు రవాణా విస్తరణ - కొత్త మార్గం 

సరు రవాణా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తూర్పు (పంజాబ్‌ - బీహార్‌), పశ్చిమ (మహారాష్ట్ర - ఉత్తర్‌ప్రదేశ్‌) కారిడార్ల అభివృద్ధి జరిగినా, మరిన్ని కారిడార్లపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా: తూర్పు - పశ్చిమ కారిడార్‌ (మహారాష్ట్ర - పశ్చిమ బెంగాల్‌) ఉత్తర - దక్షిణ కారిడార్‌ (హరియాణా - తమిళనాడు) ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌ (పశ్చిమ బెంగాల్‌ - ఆంధ్రప్రదేశ్‌) ఈ కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా సరుకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.

వివరాలు 

దేశీయ తయారీ - స్వయం సమృద్ధి లక్ష్యం 

భారతదేశంలో రైళ్లను స్వయంగా తయారు చేయడం ద్వారా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026 నాటికి ఈ రంగానికి రూ.3 లక్షల కోట్లు అవసరమని అంచనా. ప్రస్తుతం బ్రేకులు, చక్రాలు, యాక్సిళ్లు వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని స్వదేశీ ఉత్పత్తిగా మార్చుకోవడం ద్వారా దేశీయ తయారీ రంగానికి మద్దతు అందించవచ్చు.

వివరాలు 

భద్రత - కవచ్‌ విస్తరణ 

రైళ్ల ఢీకొనడాన్ని నివారించే "కవచ్‌" వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 1,465 కిలోమీటర్ల మేర 144 రైలు ఇంజిన్లకు ఈ వ్యవస్థ అమలులో ఉంది. దీన్ని 6,000 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు మరిన్ని నిధులు అవసరం. మౌలిక వసతుల విస్తరణ - ప్రజా - ప్రైవేటు భాగస్వామ్యం పైవంతెనలు, బైపాస్‌లు - రైల్వే స్వయంగా నిర్మించాల్సిన అవసరం. సరకు రవాణా టెర్మినళ్లు, ప్రయాణికుల హబ్‌లు - ఇవి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) ద్వారా అభివృద్ధి చేయాలి.

వివరాలు 

ఇలా చేస్తే రైల్వే వ్యవస్థ అభివృద్ధికి అర్ధిక భారం తగ్గుతుంది

భవిష్యత్తు ప్రణాళికలు - రైల్వేలో కొత్త మార్పులు వేగవంతమైన రైళ్ల కోసం కొత్త ప్రణాళికలు కొత్త మార్గాల నిర్మాణం, మరిన్ని స్టేషన్ల ఆధునికీకరణ పర్యావరణ అనుకూల ప్రాజెక్టులపై దృష్టి కృత్రిమ మేధస్సు (AI) వినియోగం - టికెట్ కన్ఫర్మేషన్‌, సీట్ల లభ్యత, పట్టాలు, రైళ్ల మానిటరింగ్‌లో ఉపయోగం ఆధునిక బోగీలు, ఇంజిన్ల తయారీపై ప్రత్యేక దృష్టి 2045 నాటికి 100,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లు అభివృద్ధి చేయాలనే లక్ష్యం

వివరాలు 

వందే భారత్‌ - భవిష్యత్‌ మార్గం 

భారత ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్ట్ అయిన "వందే భారత్‌" రైళ్లు విజయవంతం కావడంతో, ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరించనున్నారు. 2024 ఎన్నికల నాటికి బుల్లెట్‌ రైలు ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. వందే భారత్‌ రైళ్ల వేగాన్ని మరింత పెంచేందుకు పట్టాల గేజ్‌ మార్పిడి, డబుల్ లైన్, త్రిపుల్ లైన్, క్వాడ్రపుల్ లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పుల వల్ల వందే భారత్‌ రైళ్లు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.