Page Loader
RBI new RS 50 notes: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు

RBI new RS 50 notes: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలోనే కొత్త రూ.50 నోట్లను విడుదల చేయనున్నది. ఈ నోట్లు ఆర్‌ బి ఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉన్న నోట్లు మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతోనే ప్రచారంలో ఉన్నాయి. అయితే, గతేడాది డిసెంబర్‌లో సంజయ్‌ మల్హోత్రా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా కొత్త రూ.50 నోట్లను విడుదల చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇదే సందర్భంగా, ప్రస్తుతం చలామణీలో ఉన్న పాత రూ.50 నోట్లను ఉపయోగించుకోవచ్చని, అవి చెల్లుబాటు అవుతాయని కూడా స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్త రూ.50 నోట్లు