Page Loader
Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు
మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు

Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ఓ మోస్తరుగా రాణింపజేశాయి. నిన్నటి భారీ నష్టాల తర్వాత మదుపర్లకు కొంత ఊరట లభించింది. ముఖ్యంగా వైరస్‌కు సంబంధించి ఆందోళన అవసరం లేదన్న వార్తలు మార్కెట్‌కు మద్దతు అందించాయి. సెన్సెక్స్‌ ఉదయం స్వల్ప లాభాల్లో 78,019.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజంతా మోస్తరు లాభాలతో కొనసాగిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 78,452.74 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి, చివరికి 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగిసింది.

Details

నష్టాల్లో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌

నిఫ్టీ కూడా 91.85 పాయింట్లు లాభపడి 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు తగ్గి 85.73గా నమోదైంది. సెన్సెక్స్‌ 30లో టాటా మోటార్స్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా, జొమాటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2653 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.