2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల
2046-47 ఆర్థిక సంవత్సరానికి దేశంలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలుగా ఉంటుందని ఎస్బీఐ పరిశోధక నివేదిక ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలుగా ఉన్న ఆదాయం 25 ఏళ్లకు ఏడున్నర రెట్లు పెరుగుతుందని వెల్లడించింది. ఇటీవలే దాఖలైన ఐటీఆర్(IT RETURNS) ఫైలింగ్ లో పెరుగుదలను కొలమానంగా అంచనా వేసింది. ఫైనాన్షియల్ అసెస్‌మెంట్ ఇయర్ 2014లో రూ.4.4 లక్షల సగటు ఆదాయం ఉండగా,ప్రస్తుతం అది రూ.13 లక్షలకు పెరిగినట్లు వివరించింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. ఈ మేరకు సగటు ఆదాయం క్రమేపీ పెరుగుతోందని చెప్పుకొచ్చింది. AY 2012తో పోల్చితే ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల్లో 13.6 శాతం తక్కువ ఆదాయ పన్ను పరిమితి నుంచి అప్‌గ్రేడేషన్ జరిగినట్లు పేర్కొంది.
1.4 బిలియన్ల నుంచి 1.6 బిలియన్లకు పెరగనున్న జనాభా
అసెస్‌మెంట్ ఇయర్ 2023లో 68.5 మిలియన్ల మంది ITRను దాఖలు చేశారు. రూ.5 లక్షల వరకు ఆదాయ స్లాబులో ఉన్నారు. రూ.5 లక్షల ఆదాయపు పన్ను పరిమితికి ఈ దఫా 8.1 శాతం పెరగింది. ఈ మేరకు రూ.10-20 లక్షల ఆదాయపు పన్ను పరిమితిలోకి 3.8 శాతం ఐటీఆర్‌లు పెరిగడం విశేషం. రూ.20-50 లక్షల ఆదాయ గ్రూపులో 1.5 శాతం, రూ.50 లక్షల నుంచి రూ. కోటి ఆదాయ గ్రూపులో 0.2 శాతం మేర పెరిగింది. 2046-47FY నాటికి 25 శాతం మంది ఐటీఆర్ దాఖలు చేసే వారు అత్యల్ప ఆదాయ స్లాబ్ నుంచే అప్‌గ్రేడ్ కానున్నట్లు తెలిపింది.ఇదే సమయానికి జనాభా 1.4 బిలియన్ల నుంచి 1.6 బిలియన్లకు పెరిగే అవకాశమున్నట్లు వివరించింది.