Page Loader
Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌

Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు సెన్సెక్స్ 1,379 పాయింట్ల నష్టంతో 82,886 వద్ద కొనసాగుతున్నది.అలాగే నిఫ్టీ 420 పాయింట్ల నష్టంతో 25,376 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్,సన్‌ఫార్మా షేర్ల మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్‌ అండ్‌ టీ,బజాజ్ ఫిన్‌సర్వ్,రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ. 7 లక్షల కోట్లు ఆవిరయింది,ఇది మదుపర్ల సంపదను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.

వివరాలు 

కారణాలు ఇవే..

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళనను కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలోని భయాల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. 70-71 డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌కు సంబంధించి సెబీ ఇటీవల కఠినతరం చేసిన నియమాలు కూడా మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. చైనా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశ స్టాక్స్ బాగా ప్రదర్శిస్తున్నాయి, ఇది భారతదేశానికి చెందిన పెట్టుబడులను తరలిపోతున్నందున మదుపర్లలో ఆందోళనను పెంచుతోంది.