LOADING...
Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి
అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి

Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన పరిస్థితుల్లో, రూపాయి విలువ ఈరోజు స్వల్పంగా పెరిగింది. అమెరికా-రష్యా మధ్య చర్చల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి బలపడిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 13 పైసల లాభంతో 87.53 వద్ద ప్రారంభమైంది. గత శుక్రవారం అది 87.66 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు ట్రేడింగ్ పరిధి 87.25 నుంచి 87.80 మధ్య ఉండొచ్చని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ ట్రెజరీ అధిపతి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. భన్సాలీ అంచనాల ప్రకారం,ఈరోజు రూపాయి చిన్న స్థాయి లాభాలతో 87.51 వద్ద ప్రారంభం కానుంది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.25 డాలర్లు 

ప్రస్తుతం మార్కెట్లు అమెరికా, భారత ద్రవ్యోల్బణ డేటా,అలాగే ఆగస్టు 15న జరగనున్న అమెరికా-రష్యా చర్చలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ చర్చలు విజయవంతమై రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రాగలిగితే, భారతదేశంపై ఉన్న అదనపు 25బేసిస్ పాయింట్ల సుంకాల సమస్య పరిష్కారం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి బలహీనతను అదుపులో ఉంచడానికి ఆర్‌బీఐ డాలర్ల విక్రయానికి దిగుతుందని, దీంతో ఎగుమతిదారులు తమ తక్షణ లాభాలను విక్రయించే అవకాశముందని సూచించారు. మరోవైపు, ఆసియా వాణిజ్య మార్కెట్లో సోమవారం ఉదయం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.25 డాలర్లకు పడిపోయింది. గత వారం నుంచే ఈ తగ్గుదల కొనసాగుతోంది.రష్యా-అమెరికా మధ్య ఉక్రెయిన్ సమస్యపై శాంతి చర్చలు జరగబోతున్నందున, వ్యాపారులు వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.