Loading...
Samsung Modine Acquisition: $6 బిలియన్ కంపెనీపై శాంసంగ్ కన్ను.. ఏఐ డేటా సెంటర్లే టార్గెట్
$6 బిలియన్ కంపెనీపై శాంసంగ్ కన్ను.. ఏఐ డేటా సెంటర్లే టార్గెట్

Samsung Modine Acquisition: $6 బిలియన్ కంపెనీపై శాంసంగ్ కన్ను.. ఏఐ డేటా సెంటర్లే టార్గెట్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్‌కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాకు చెందిన మోడిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డేటా సెంటర్ల కూలింగ్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన మోడిన్ విలువ సుమారు $5.6 బిలియన్లు. బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. ఈ డీల్ కొన్ని వారాల్లోనే ఖరారయ్యే అవకాశం ఉంది.

Details

డీల్ వార్తతో ఒక్కసారిగా దూసుకెళ్లిన షేరు

గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మోడిన్ షేరు ధర $106.10 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు $5.6 బిలియన్లుగా నమోదైంది.

అయితే శాంసంగ్ కొనుగోలు చర్చలు తెరపైకి వచ్చిన వెంటనే షేరు ధర లేట్ ట్రేడింగ్‌లో $135కు పైగా ఎగబాకింది.

అంటే ఒక్కసారిగా దాదాపు 28 శాతం పెరిగింది. నవంబర్ 3 నుంచి నిరాశాజనక త్రైమాసిక ఫలితాల కారణంగా మోడిన్ షేరు సుమారు 15 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ పెరుగుదల మరింత ఆసక్తికరంగా మారింది.

Details

డేటా సెంటర్లే మోడిన్‌కు అసలైన బలం

అమెరికాలోని విస్కాన్సిన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన మోడిన్ పెద్ద వాణిజ్య భవనాలు, పారిశ్రామిక యంత్రాలకు అవసరమైన హీటింగ్, కూలింగ్ సిస్టమ్స్‌ను తయారు చేస్తుంది.

అయితే ప్రస్తుతం కంపెనీ వేగంగా ఎదుగుతున్న విభాగం హైపర్‌స్కేలర్ డేటా సెంటర్లకు కూలింగ్ సొల్యూషన్స్ అందించడం. అక్టోబర్‌లో ఆటోమోటివ్ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విడదీసి, థర్మల్ మేనేజ్‌మెంట్ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టింది.

ADVERTISEMENT

Details

శాంసంగ్‌కు మరో కీలక అడుగు

డేటా సెంటర్ల కోసం థర్మల్ సొల్యూషన్స్‌ విస్తరించడంలో శాంసంగ్ ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తోంది. గతేడాది జర్మనీకి చెందిన FlaktGroup Holding GmbHను 1.5 బిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.

ఇప్పుడు మోడిన్ డీల్ కూడా కుదిరితే.. ఏఐ మౌలిక సదుపాయాల మార్కెట్లో శాంసంగ్ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది.

డైకిన్, ఎల్‌జీ, వెర్టివ్ వంటి సంస్థలు కూడా ఇదే రంగంలో అవకాశాల కోసం పోటీపడుతున్నాయి.

ADVERTISEMENT