Page Loader
SBI q4 results: ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్‌!
ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్‌!

SBI q4 results: ఎస్‌బీఐకు త్రైమాసికంలో రూ.18,643 కోట్ల లాభం.. షేర్‌దారులకు భారీ డివిడెండ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మార్చితో ముగిసిన 2023-24 నాలుగో త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ రూ.18,642.59 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. ఇదే త్రైమాసికానికి గతేడాది వచ్చిన రూ.20,698 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం తగ్గుదల. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ సంపాదించిన ఆదాయం రూ.1,43,876 కోట్లు కాగా, ఇదే గడువు నాటికి గతేడాది అది రూ.1,28,412 కోట్లుగా ఉండింది. జనవరి-మార్చి మధ్య వడ్డీ ఆదాయం రూపంలో బ్యాంక్‌ రూ.1,19,666 కోట్లు ఆర్జించింది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఒక్కో షేరుకు రూ.15.90 చొప్పున డివిడెండ్‌ను ఎస్‌బీఐ ప్రకటించింది.

Details

ఎస్‌బీఐ నికర లాభం కొంతమేర తగ్గింపు

ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కూడా నమోదైంది.స్థూల నిరర్థక ఆస్తుల స్థాయి 2.24 శాతం నుండి 1.82 శాతానికి తగ్గింది. నికర నిరర్థక ఆస్తులు 0.57 శాతం నుండి 0.47 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ఏకీకృత ప్రాతిపదికన ఎస్‌బీఐ నికర లాభం కూడా కొద్దిగా తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.21,384 కోట్లు లాభంగా నమోదు కాగా, ఈసారి అది రూ.19,600 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1.64 లక్షల కోట్ల నుంచి రూ.1.79 లక్షల కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ, స్టాండలోన్‌ ప్రాతిపదికన ఎస్‌బీఐ రూ.70,901 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాది రూ.61,077 కోట్లతో పోలిస్తే సుమారు 16 శాతం వృద్ధిని సూచిస్తోంది.