
Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
మిశ్రమమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ మే 20 మంగళవారం రోజున తీవ్రంగా నష్టపోయింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు క్షీణించగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ 24,700 పాయింట్లకు దిగువకు పడిపోయింది.
ఈ దెబ్బతో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగటున ఒక శాతం వరకూ పడిపోయాయి. ఈ పతనంతో మార్కెట్‌లో అమ్మకాలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి.
వివరాలు
మార్కెట్ పతనానికి కారణాలు ఏమిటి?
ఈరోజు మార్కెట్ ఎందుకు ఈ స్థాయిలో పడిపోయిందనేది పరిశీలిస్తే, కొన్ని ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:
1. వాణిజ్య చర్చలపై స్పష్టత కొరవడటం భారత మార్కెట్ ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కోసం ఎదురు చూస్తోంది.
చైనా,యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాలు అమెరికాతో విజయవంతంగా ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు అమెరికా-ఇండియా చర్చల వైపే మళ్లింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం,వాణిజ్య ఒప్పందం విషయంలో క్లారిటీ రాకపోతే మార్కెట్లో అస్థిరత కొనసాగే అవకాశముంది.
వివరాలు
2. అధిక వాల్యుయేషన్లు (Elevated Valuations)
ఈ అంశంపై స్పందించిన పూర్ణార్థ వన్ స్ట్రాటజీ ఫండ్ మేనేజర్ మోహిత్ ఖన్నా మాట్లాడుతూ - "అమెరికా ప్రస్తుతం భారత్ సహా అనేక దేశాలతో టారిఫ్,వాణిజ్య చర్చల్లో ఉంది.ఈ చర్చల ఫలితాలు స్పష్టంగా వచ్చే వరకు మార్కెట్ ఒక రేంజ్‌లోనే కదలే అవకాశముంది,"అని చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్ అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కొత్తగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తోంది.
నిఫ్టీ ప్రస్తుత PE రేషియో 22.3 వద్ద ఉండగా, ఇది గత ఆరు నెలల గరిష్ట స్థాయి. ఇది గత రెండు సంవత్సరాల సగటు PE అయిన 22.2 కంటే స్వల్పంగా ఎక్కువ అని నిపుణులు విశ్లేషించారు.
వివరాలు
మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలు
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ.. "ఇప్పుడు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ దశలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకెత్తుతుండటంతో, అధిక వాల్యుయేషన్ల ప్రభావం మరింత అధికంగా ఉండొచ్చు" అన్నారు.
ఇక మార్సెల్లస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ చీఫ్ కృష్ణన్ వీఆర్ మాట్లాడుతూ.. "మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ విభాగాల్లో వాల్యుయేషన్లు పెరిగిన నేపథ్యంలో, మధ్యకాలికంగా రాబడులపై నిర్దిష్టత కొరవడే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు.
ఇవన్నీ కలిపి చూస్తే, మే 20 న మార్కెట్‌లో కనిపించిన నష్టాలు తాత్కాలికమైతే కావచ్చు కానీ, స్పష్టత రానంతవరకు మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.