Page Loader
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు తమ నిధులను క్రమంగా మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటుండటం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాలలో ఉన్న స్టాక్‌ల ఫలితాలు నిరాశకు గురి చేయటం వల్ల సూచీల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో, ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు పడిపోయి 78,515 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద ఉంది.

వివరాలు 

స్టాక్ మార్కెట్‌లో నష్టపోతున్న స్టాక్స్ 

సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, టాటా స్టీల్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మెటార్స్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి 

అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు ధర 2,614.80 డాలర్ల వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టంతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ASX 0.88%, జపాన్ నిక్కీ 1.07%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.71% నష్టాలతో ఉన్నాయి, కానీ షాంఘై సూచీ 0.03% లాభాలతో కొనసాగుతోంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ వాణిజ్యం విదేశీ సంస్థాగత మదుపర్లు నవంబర్ ప్రారంభం నుండి మార్కెట్లో విక్రయాలు పెంచారు. మంగళవారం వారు రూ.3,024 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. మరోవైపు, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,854 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

వివరాలు 

ధరల పెరుగుదల 

అక్టోబర్ 2024లో వినియోగ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21%కి చేరింది. ఇది 14 నెలల గరిష్ఠ స్థాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ధేశించిన 6% గరిష్ఠ స్థాయికి ఇది పైగా ఉంది. ఈ రకమైన స్థాయిని 2023 ఆగస్టులో 6.83% వద్ద నమోదైన తరువాత, ఈ స్థాయి తరువాత మళ్లీ కనిపించింది.