Stock market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, అమెరికా బాండ్ రాబడులు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయంగా పతనమయ్యాయి. ఈ భారీ అమ్మకాలతో మదుపర్ల సంపదలో దాదాపు రూ.8 లక్షల కోట్ల మేర ఆవిరైంది. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 860.37 పాయింట్లు నష్టపోయి 71,619.92 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 293 పాయింట్లు కోల్పోయి 22,326.95 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయి 22,350 స్థాయి దిగువకు జారిపోయింది.
వివరాలు
సెన్సెక్స్ 30
సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూస్తున్నాయి.
అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
కారణాలు ఇవే..
ఎఫ్‌ఐఐల అమ్మకాలు..
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది.
బుధవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.10,148 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.
అంతకుముందు మంగళవారం కూడా దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
దీంతో ఈ వారంలో ఇప్పటివరకు దేశీయ మార్కెట్ల నుంచి సుమారు రూ.26 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
వివరాలు
కారణాలు ఇవే..
అమెరికా బాండ్ రాబడుల ప్రభావం..
అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 5.33 శాతానికి చేరింది. 2007 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
అలాగే 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 5.65 శాతానికి చేరుకుని 2002 తర్వాత అత్యధిక స్థాయిని నమోదు చేసింది.
అమెరికా బాండ్ రాబడులు పెరగడంతో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఆకర్షణ మారి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది.