
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,591.95
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని, మార్కెట్ మళ్లీ నిలదొక్కుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆటో దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడంతో, మార్కెట్ ఉదయం నష్టాలతో ప్రారంభమైనా, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.
ఆటో, ఫార్మా, టెలికమ్యూనికేషన్ రంగాలను మినహాయించి మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.
నిఫ్టీ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
ట్రంప్ టారిఫ్ ప్రభావంతో, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన మాతృసంస్థ టాటా మోటార్స్ షేర్లు 6 శాతం మేర క్షీణించాయి.
అమెరికా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు ప్రధాన మార్కెట్ కావడం ఇందుకు కారణం.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.61 డాలర్లు
సెన్సెక్స్ ఉదయం 77,087.39 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 77,288.50)నష్టాలతో ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 77,082.51 నుండి 77,747.46 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సూచీ,చివరికి 317.93 పాయింట్ల లాభంతో 77,606.43 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 105.10 పాయింట్లు పెరిగి 23,591.95 వద్ద ముగిసింది.
రూపాయి మారకం విలువ డాలరుతో 85.79 గా ఉంది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ,ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
అయితే, టాటా మోటార్స్, సన్‌ఫార్మా,కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.61 డాలర్లుగా ఉండగా, బంగారం ధర పెరిగి ఔన్సుకు 3,087 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.