NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
    లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

    Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 27, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ముఖ్యంగా ఆటో షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో, మార్కెట్ తొలుత నష్టాల్లో ప్రారంభమైంది.

    అయితే, ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కొద్ది సేపటికే లాభదాయక మార్గంలో సాగింది.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 246 పాయింట్ల లాభంతో 77,537 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 59 పాయింట్ల లాభంతో 23,546 వద్ద కొనసాగింది.

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.85 డాలర్లు 

    సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతుండగా, జొమాటో, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్టీపీసీ, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.85 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు 3,036 డాలర్ల మార్క్‌ను దాటి ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.90 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    టారిఫ్‌ భయాలతో నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు బుధవారం టారిఫ్‌ భయాలతో నష్టాల్లో ముగిశాయి.

    ఎస్‌అండ్‌పీ సూచీ 1.12 శాతం, నాస్‌డాక్‌ 2.04 శాతం నష్టపోగా, డౌజోన్స్‌ స్థిరంగా ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    ఆస్ర్టేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.55 శాతం, జపాన్‌ నిక్కీ 0.93 శాతం నష్టపోగా, హాంకాంగ్‌ హాంగ్‌ సెంగ్‌ 0.81 శాతం, షాంఘై 0.31 శాతం లాభంలో ఉన్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం రూ.2,241 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.696 కోట్ల షేర్లు విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    స్టాక్ మార్కెట్

    Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్  బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్‌ దాటింది! వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025