
Stock Market: మళ్ళీ నష్టాల్లో స్టాక్ దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,150
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత రోజు లాభాల్లో కొనసాగిన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగించితే 100 శాతం సుంకం విధిస్తామని నాటో (NATO) జారీ చేసిన హెచ్చరికలు భారత్ (India), చైనా,బ్రెజిల్ వంటి దేశాలకు చేసే ప్రభావంపై మదుపర్లు దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల్లో వారు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్ల నష్టంతో 82,422 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 45.7 పాయింట్లు పడిపోయి 25,150 స్థాయిలో కొనసాగుతోంది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.03 నమోదు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 27 పైసలు తగ్గి 86.03 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నాడు మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు అదే ధోరణిని అనుసరిస్తున్నాయి. అయితే, జపాన్ నిక్కీ, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలో ఉన్నాయి.