Page Loader
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750
లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్య స్టాక్స్‌లో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపించడంతో షేర్లు పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్లు చోటుచేసుకోవడంతో సూచీలు రాణిస్తున్నాయి . నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,750 పైన ప్రారంభమైంది. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 151 పాయింట్లు పెరిగి 78,656 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 23,786 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, జొమాటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

డాలర్‌  85.73వద్ద కొనసాగుతోంది

కానీ ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.69 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,645 రూపాయల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్‌ నిక్కీ, షాంఘై, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ స్థిరంగా ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా 1,783 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) 1,690 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.