LOADING...
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,913
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,913

Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,913

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై విధించబోయే ద్వితీయశ్రేణి ఆంక్షల విషయంలో ట్రంప్‌ నెమ్మదించడం,అలాగే ఉక్రెయిన్‌ యుద్ధంపై జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించబడటం వంటి పరిణామాలు దేశీయ మార్కెట్‌ సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ ప్రభావంతో మంగళవారం ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు పెరిగి 81,379 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగసి 24,913 వద్ద ట్రేడవుతున్నాయి. షేర్‌ మార్కెట్‌లో వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌, లక్ష్మీ ఆర్గానిక్స్‌, వెల్స్పన్‌ లివింగ్‌ వంటి కంపెనీలు లాభాల్లో కొనసాగుతుండగా, భారత్‌ డైనమిక్స్‌, గణేష్‌ ఎకోస్పేర్‌, అశోక్‌ లేల్యాండ్‌, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి సంస్థలు నష్టాల్లో జారుకున్నాయి.

వివరాలు 

రూపాయి విలువ 10 పైసలు బలపడింది

కరెన్సీ మార్కెట్ విషయానికి వస్తే, నిన్నటి ముగింపుతో పోల్చితే రూపాయి విలువ 10 పైసలు బలపడింది. ఈ రోజు ట్రేడింగ్‌ను రూపాయి రూ.87.25 వద్ద ప్రారంభించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన మార్కెట్లు మాత్రం మిశ్రమ ధోరణి ప్రదర్శిస్తున్నాయి. జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 200, తైవాన్‌ సూచీలు నష్టాల్లో కదలాడుతుండగా, చైనా షాంఘై, హాంకాంగ్‌ హెచ్‌ఎస్‌ఐ సూచీలు లాభాల దిశగా కదులుతున్నాయి.