Page Loader
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600
లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సూచీలు బలంగా నిలుస్తున్నాయి. ఉదయం 9:27 గంటలకు సెన్సెక్స్ 201 పాయింట్ల లాభంతో 80,938 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 24,601 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 సూచీగా భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎంఅండ్ ఎం, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా,టీసీఎస్,అల్ట్రాటెక్ సిమెంట్,టైటాన్,ఐసీఐసీఐ బ్యాంక్,సన్‌ఫార్మా,యాక్సిస్ బ్యాంక్,ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

రూపాయి-డాలర్ మారకం విలువ 85.80 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 65.42 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 3,390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ 0.81%, ఎస్ అండ్ పీ 500 0.58%, డోజోన్స్ 0.51% లాభాలను నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు కూడా అదే ధోరణిలో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ 1.04%, ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.87%,హాంగ్‌సెంగ్ 0.69%,షాంఘై 0.38% లాభాలతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మూడో రోజు వరుసగా విక్రేతలుగా నిలిచారు. మంగళవారం వారు నికరంగా రూ.2,854 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా,దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.5,908కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.