Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం 
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్‌ ఒడిదొడుకులకు లోనైంది. రోజంతా లాభ, నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 75,787.27 వద్ద (మునుపటి ముగింపు 75,967) నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 75,581 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 28 పాయింట్లు తగ్గి 75,939 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 22,932 వద్ద స్థిరపడింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.30 డాలర్లు 

సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్ఏం, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. మరోవైపు, జొమాటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,962.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.