Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉత్కంఠతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 76,585 వద్ద ఉన్నది, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 23,203 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఐటీసీ హోటల్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిసినవి.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.59

మరోవైపు, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.59 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 76.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,772.70 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికన్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి, నాస్‌డాక్‌ 0.51%, ఎస్‌అండ్‌పీ 500 0.47%, డౌజోన్స్‌ 0.25% నష్టాలు చవిచూశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.2,586 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,793 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

వివరాలు 

ఫెడ్‌ వడ్డీ రేట్లు యధాతథం 

ఫెడ్‌ వడ్డీ రేట్లు యథాతథంగానే కొనసాగించడంపై, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను బుధవారం ప్రకటించింది. వడ్డీ రేట్లను అలాగే ఉంచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 4.25-4.50 శాతం మధ్య ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్‌ పరిస్థితులు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం మాత్రం లక్ష్యాన్ని కంటే కొంత అధికంగా ఉన్నట్లు ఫెడ్‌ వెల్లడించింది.