Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,912
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిక్స్డ్ సంకేతాలు రావడం వల్ల మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు పెద్దగా మార్పులు లేకుండా ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి 79,049 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 42 పాయింట్లు తగ్గి 23,908 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో కొన్ని కంపెనీలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అవి యాక్సిస్ బ్యాంక్,ఐటీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్,టెక్ మహీంద్రా,సన్‌ఫార్మా షేర్లు. మరోవైపు టీసీఎస్,ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్,టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.46 డాలర్ల వద్ద కొనసాగుతూ, బంగారం ఔన్సు 2,613.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.07 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి, అలాగే ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.20 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, జపాన్ నిక్కీ 0.28 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.36 శాతం, షాంఘై 0.54 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.4,225 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,943 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.