Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొన్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు, దీని ప్రభావంతో సూచీలు మార్మోగుతూ సాగుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 55 పాయింట్లు తగ్గి 75,668 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 22,903 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్,ఇన్ఫోసిస్,అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా,మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, టాటా స్టీల్, జొమాటో, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ,టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76.40 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,943.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతుండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2.89%, జపాన్ నిక్కీ 0.11%, షాంఘై 0.74% లాభపడ్డాయి.
అయితే ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.3,312 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,908 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.