Sensex, Nifty, SMIDs: వరుసగా స్టాక్ మార్కెట్ ఎందుకు పతనం అవుతోంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది.
ట్రేడింగ్ సెషన్ మొదలవుతుందంటేనే భయంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో, సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయంగా పడిపోయాయి.
ఈ రోజు ఉదయం 10:45 గంటల సమయానికి, సెన్సెక్స్ 731 పాయింట్లు నష్టపోయి 74,580 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ50 225 పాయింట్లు కోల్పోయి 22,571 వద్ద కొనసాగుతోంది. "ట్రంప్ టారిఫ్‌లు, నిరంతర ఎఫ్‌ఐఐ విక్రయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి," అని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ అన్నారు.
వివరాలు
భారత జీడీపీ వృద్ధి రేటు 2025 నాటికి 6.4 శాతం
భారత ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇది ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యంపై ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకోవడానికి భారత ఆర్థిక వృద్ధి స్థిరత్వమే ప్రధాన కారణంగా నిలిచింది.
అయితే, తాజా స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రముఖ సంస్థల సవరించిన అంచనాల ప్రకారం, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటుందని సూచనలున్నాయి.
అమెరికా సుంకాలు, ప్రపంచ డిమాండ్ తగ్గిపోవడం వల్ల భారత జీడీపీ వృద్ధి రేటు 2024లో 6.6 శాతంగా నమోదవగా, 2025 నాటికి 6.4 శాతానికి తగ్గుతుందని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది.