Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు; సెన్సెక్స్ 256 , నిఫ్టీ@ 22650
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్-నిఫ్టీ లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9.58 గంటలకు సెన్సెక్స్ 251.72 (0.33%) పాయింట్ల లాభంతో 74,472.78 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 79.00 (0.35%) పాయింట్ల లాభంతో 22,676.80 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు, ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ పబ్లిక్‌గా మారిన తర్వాత, మార్కెట్‌లో ఫ్లాట్ ట్రేడింగ్ జరిగింది.
డొమినోస్ ఫ్రాంచైజీ కంపెనీ లాభాల్లో పెరుగుదల
సెన్సెక్స్ షేర్లలో ఏషియన్ పెయింట్స్, ఇండియన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు క్షీణించాయి. అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనిశ్చితి నేపథ్యంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ షేర్లు 0.23% బలపడ్డాయి. Coforge,LTTS,పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు దీనికి దోహదపడ్డాయి. సింగిల్ షేర్లలో,జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు ప్రారంభ ట్రేడ్‌లో 5% వరకు పెరిగాయి. నాల్గవ త్రైమాసికంలో భారతదేశంలోని డొమినోస్ ఫ్రాంచైజీ కంపెనీ లాభాల్లో పెరుగుదలను చూసింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్,రియల్టీ,కన్స్యూమర్ డ్యూరబుల్స్,నిఫ్టీ గ్యాస్ అండ్ ఆయిల్ షేర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు నిఫ్టీ ఆటో,ఎఫ్‌ఎంసిజి,మీడియా,మెటల్,ఫార్మా రంగాల షేర్లు బలహీనంగా ఉన్నాయి.