Page Loader
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపించింది. ఫలితంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22,850 కంటే తక్కువ వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 330 పాయింట్లు క్షీణించి 75,609 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 22,851 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఐటీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,జొమాటో,సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

వివరాలు 

రూపాయి-డాలర్ మారకం విలువ 86.86 

మరోవైపు, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రూపాయి-డాలర్ మారకం విలువ 86.86 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 71.96 డాలర్లుగా ఉంది, బంగారం ఔన్సు 2,960.30 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం స్థిరంగా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.50 శాతం,జపాన్ నిక్కీ 1.49శాతం,హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.75 శాతం,షాంఘై సూచీ 0.22 శాతం నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ విక్రయాలను తగ్గిస్తున్నారు. బుధవారం వారు నికరంగా రూ.1,881కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)నికరంగా రూ.1,958కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.