LOADING...
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141 
స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. చివరకు సూచీలు స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. అదే సమయంలో, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. సెన్సెక్స్ ఉదయం 82,473.02 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపు స్థాయి అయిన 82,391.72 పాయింట్ల కంటే కొద్దిగా అధికంగా ఉంది. ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 82,308.91 పాయింట్ల కనిష్ట స్థాయిలో, 82,783.51 పాయింట్ల గరిష్ట స్థాయిలో కదలాడింది. చివరకు ఇది 123 పాయింట్లు పెరిగి 82,515.14 పాయింట్ల వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర 67.69 డాలర్లు 

నిఫ్టీ సూచీ కూడా 37 పాయింట్లు లాభపడి 25,141 వద్ద స్థిరపడింది. ఆర్ధిక రంగంలో కీలకమైన రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 85.52గా నమోదైంది. సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,రిలయన్స్ ఇండస్ట్రీస్,బజాజ్ ఫిన్‌సర్వ్,ఐసీఐసీఐ బ్యాంక్,టాటా మోటార్స్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, టాటా స్టీల్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర ప్రస్తుతం 67.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బంగారం ధర ఔన్సు వద్ద 3,354 డాలర్లుగా ఉంది.