LOADING...
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి.ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు,మెటల్‌,ఐటీ,ఆటో రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లతో సూచీలు మంచి వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా జులై నెలకు సంబంధించిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకంటే తక్కువగా రావడంతో,సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలు బలపడాయి. ఇదిదేశీయ మార్కెట్లలో కొనుగోళ్లకు దోహదం చేసింది.వడ్డీరేట్లు తగ్గితే అమెరికాలో బాండ్లపై రాబడి తగ్గుతుంది. దీంతో డాలర్‌ విలువ క్షీణిస్తుంది.డాలర్ బలహీనపడటం వృద్ధి చెందుతున్న దేశాలకు,ముఖ్యంగా భారత్ వంటి మార్కెట్లకు అనుకూలంగా మారుతుంది. ఈనేపథ్యంలో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల కలిపిన మార్కెట్ విలువ దాదాపు రూ.4.5లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌ రూ.449లక్షల కోట్లను అధిగమించింది.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 3406 డాలర్లు 

సెన్సెక్స్‌ ఉదయం 80,765.83 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది (మునుపటి ముగింపు 80,599.91). ట్రేడింగ్‌ సమయం మొత్తం లాభాల్లోనే కొనసాగింది.ఇంట్రాడేలో సూచీ గరిష్ఠంగా 81,093.19 పాయింట్లను తాకగా,చివరికి 418.81పాయింట్ల లాభంతో 81,018.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 157.40 పాయింట్ల లాభంతో 24,722.75 వద్ద ముగిసింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.87.70గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30షేర్లలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లను మినహాయిస్తే మిగతా అన్ని కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా టాటా స్టీల్‌,బీఈఎల్‌,అదానీ పోర్ట్స్‌,టెక్ మహీంద్రా,టీసీఎస్‌ షేర్లు కీలకంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే,బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 68.84డాలర్ల వద్ద ట్రేడవుతుండగా,బంగారం ఔన్సు ధర 3406 డాలర్ల వద్ద కొనసాగుతోంది.