Page Loader
Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నఅంచనాలతో సూచీలు రాణించాయి. ఐటీ, ఔషధ రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) తిరిగి కొనుగోలుదారులుగా ముందుకు రావడం మార్కెట్‌ను మరింత బలపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర రాణించింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్‌ 81,196.08 పాయింట్ల వద్ద (ముందురోజు ముగింపు స్థాయి 80,998.25 పాయింట్లు) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ముఖ్యమైన షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో సూచీ ఇంట్రాడేలో 81,911.13 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.10 డాలర్లు 

చివరికి ఇది 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 24,899 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసి, చివరికి 130 పాయింట్ల లాభంతో 24,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,రిలయన్స్ ఇండస్ట్రీస్‌,అల్ట్రాటెక్ సిమెంట్‌,అదానీ పోర్ట్స్‌,సన్ ఫార్మా,ఐటీసీ,హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫైనాన్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,413 డాలర్ల వద్ద కొనసాగుతోంది.