Page Loader
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 624 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు చొప్పున నష్టం 
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 624 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు చొప్పున నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ సెషన్‌ మధ్యలో సెన్సెక్స్ 1300 పాయింట్ల వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ముఖ్యంగా ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ పరిణామాల కారణంగా గత రెండు రోజుల వరుస లాభాలకు ముగింపు పలికింది. నిఫ్టీ సూచీ మళ్లీ 24,850 పాయింట్ల స్థాయిని తాకింది.

వివరాలు 

నిఫ్టీ@ 24,826.20

సెన్సెక్స్ ఉదయం 82,038.20 పాయింట్ల వద్ద ప్రారంభమై (గత ట్రేడింగ్ ముగింపు 82,176.45) కొద్దిపాటి నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే కాసేపటికే సూచీ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది.తదుపరి కొన్ని క్షణాల్లో లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్ 82,410.52 పాయింట్ల వద్ద రోజు గరిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ మదుపర్లకు ఆనందించేందుకు అవకాశం లేకుండా తిరిగి నష్టాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో కనిష్ఠంగా 81,121 పాయింట్లను తాకిన అనంతరం చివరికి 624 పాయింట్ల నష్టంతో 81,551.63 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కూడా 174.95 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుని 24,826.20 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కి 64.87 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కి 64.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే బంగారం ఔన్సు ధర 3,294 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.