
Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,773
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఈ ఉదయం సూచీలు మోస్తరు లాభాల్లో కదలాడిన సూచీలు, ఆఖరి గంటలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా,ఇంట్రాడే లాభాలు మాయం అయ్యాయి. ఆటోమొబైల్,ఫైనాన్షియల్ రంగంలోని షేర్లు బలంగా ప్రదర్శించగా,ఐటీ రంగానికి చెందిన షేర్లపై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ప్రభావం చూపించింది. ఈరోజు సూచీలు 80,904.40 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. తరువాత,సూచీ స్థిరంగా పెరుగుతూ గరిష్ఠంగా 81,171.38 పాయింట్ల స్థాయిని తాకింది.
వివరాలు
మంచి లాభాలను నమోదు చేసిన సెన్సెక్స్ 30
అయితే చివరికి 76.54 పాయింట్ల లాభాన్ని కాపాడుకొని 80,787.30 పాయింట్ల వద్ద స్థిరమైంది. అలాగే నిఫ్టీ సూచీ 32.15 పాయింట్ల లాభంతో 24,773.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. కానీ ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టంలో ముగిసాయి.