Page Loader
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టనుండడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఒక దశలో, సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోయింది, తరువాత కొంత కోలుకుంది. నిఫ్టీ 23,200 స్థాయికి చేరింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 86.61

సెన్సెక్స్ ఉదయం 77,069.19 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,042.82) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే అది నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,263.29 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 423.49 పాయింట్ల నష్టంతో 76,619.33 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 108.60 పాయింట్ల నష్టంతో 23,203.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.

వివరాలు 

 బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 81 డాలర్లు 

సెన్సెక్స్ 30 సూచీలో గురువారం ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ 6 శాతం మేర నష్టపోయింది. బలహీన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ 5 శాతం మేర క్షీణించింది. దీని ప్రభావం ఇతర బ్యాంక్ షేర్లపైనా పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ కూడా నష్టాల్లో ముగిశాయి. జొమాటో, రిలయన్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 81 డాలర్ల ఎగువన ట్రేడవుతుండగా, బంగారం 2730 డాలర్ల వద్ద కొనసాగుతోంది.