
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిసాయి.గత మూడు ట్రేడింగ్ సెషన్లుగా నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు ఈరోజు మోస్తరు లాభాలను నమోదు చేశాయి.
ట్రేడింగ్ సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు పెరిగింది.ముఖ్యంగా రియల్టీ, ఫార్మా రంగాల్లోని షేర్లలో బలమైన కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.
అదేవిధంగా ఆటో, బ్యాంకింగ్,ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కూడా మంచి పనితీరు కనిపించింది,ఇది సూచీల లాభాలకు మద్దతిచ్చింది.
అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులు మార్కెట్లలో అమ్మకాలు కొనసాగించడంపై మార్కెట్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విదేశీ విక్రయాలు మార్కెట్లు మరింతగా ఎగబాకేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
నిఫ్టీ సూచీ 129.55 పాయింట్లు పెరిగి 24,813.45 వద్ద ముగిసిన ట్రేడింగ్
సెన్సెక్స్ ఈరోజు ఉదయం 81,327.61 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది.
ఇది గత ముగింపు స్థాయి అయిన 81,186.44 పాయింట్ల కంటే ఎక్కువ. ఇంట్రాడేలో సూచీ 82,021.64 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.
చివరికి ఇది 410 పాయింట్ల లాభంతో 81,596.63 పాయింట్ల వద్ద స్థిరపడింది.నిఫ్టీ సూచీ 129.55 పాయింట్లు పెరిగి 24,813.45 వద్ద ట్రేడింగ్ ముగించింది.
రూపాయి మారకం విలువ అమెరికన్ డాలరుతో 85.64గా నమోదైంది.సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్,టాటా స్టీల్,సన్‌ఫార్మా,టెక్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్స్ షేర్లు ముఖ్యంగా లాభాలు పొందినవిగా కనిపించాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.17 డాలర్లు
మరోవైపు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సు (ounce)కు 3,314 డాలర్ల వద్ద నిలకడగా ఉంది.