
Stock Market: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.
అమెరికా టారిఫ్‌ల భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి, నిఫ్టీ 23,300 మార్క్ దిగువకు పడిపోయింది.
మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి.
ప్రధాన షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1161 పాయింట్ల నష్టంతో 76,253 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 23,231 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
వివరాలు
లాభాల్లో ఐటీసీ షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, జొమాటో, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే:
1. ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
2. ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,మారుతీ సుజుకీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిపెంచాయి.
3. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.51శాతం పెరిగి 74.74డాలర్లకు చేరింది.భారత్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉండటంతో ముడి చమురు ధరలు పెరగడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
4. ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలో ఆర్థికమాంద్యం ప్రభావం పెరగనని గోల్ట్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని 20శాతం నుంచి 35శాతానికి పెంచింది. దీంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.