Zomato -Swiggy: జొమాటో షేర్లు 11శాతం పతనం.. స్విగ్గీ షేర్లలో భారీ క్షీణత
ఈ వార్తాకథనం ఏంటి
జొమాటో, స్విగ్గీ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా, ఆ ప్రభావం స్విగ్గీ షేర్లపై కూడా పడింది.
రెండు కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జొమాటో తమ మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ.59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
కానీ గతేడాది ఇదే త్రైమాసికం గానూ 57.2% లాభంలో క్షీణతను నమోదుచేసింది.
జొమాటో తన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ ద్వారా ఆర్డర్లను త్వరగా పూర్తి చేసేందుకు, స్టోర్ల విస్తరణను గమనంగా చేపట్టడంతో లాభం తగ్గిందని వివరించింది.
Details
స్విగ్గీ షేర్లు 10శాతం క్షీణత
పెరిగిన పెట్టుబడులు, స్టోర్ విస్తరణ కారణంగా సమీప కాలంలో నష్టాలు నమోదవగలవని జొమాటో తెలిపింది.
ఫలితాల తరువాత, బ్రోకరేజీ సంస్థలు అంచనాలను తగ్గించడంతో జొమాటో షేర్లు 11శాతం పతనమయ్యాయి.
క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరిగే సమయంలో బలహీన ఫలితాల ప్రకటన కూడా షేర్ల అమ్మకాల ఒత్తిడికి కారణమైంది.
స్విగ్గీ షేర్లు కూడా ఈరోజు 10శాతం కంటే ఎక్కువ క్షీణించాయి.
గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లో ఉన్న షేర్లు ఈ రోజు భారీగా క్షీణించాయి.
Details
నష్టాల్లో స్విగ్గీ షేర్లు
స్విగ్గీకి సంబంధించిన తాజా త్రైమాసిక ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ సంస్థ ఈ తేదీని ఇంకా ప్రకటించలేదు.
జొమాటో ఫలితాల బలహీనత స్విగ్గీ షేర్లపై ప్రభావం చూపింది. దీంతో స్విగ్గీ షేర్లు 8 వారాల కనిష్ఠమైన రూ.427 వద్ద పడిపోయాయి.
సమాచారం ప్రకారం, 12:30 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో జొమాటో షేర్లు 9.68% క్షీణించి రూ.216.55 వద్ద ట్రేడవుతున్నాయి.
స్విగ్గీ షేర్లు 8.83% నష్టంతో రూ.436 వద్ద కదలాడుతున్నాయి.