సిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్, స్టార్టప్‌లపై ప్రభావమెంత?
స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్‌లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్‍వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్‌పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది టెక్నాలజీ స్టార్టప్‌లకు ఫైనాన్సింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. భారత్‌లోని అనేక స్టార్టప్‌లకు ఎస్‍వీబీ రుణాలను ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంక్ పనిచేయకపోవడం వల్ల ఈ స్టార్టప్‌లకు నిధుల ఖాళీ ఏర్పడింది. వారు ఇప్పుడు ఫైనాన్సింగ్ కోసం వేరే చోట వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం ఇప్పటికే రద్దీగా ఉన్న భారతీయ ఫైనాన్స్ మార్కెట్లపై పడింది.
తగ్గిన విదేశీ క్యాపిటల్ పెట్టుబడులు
కరోనా వల్ల వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఫైనాన్స్ మార్కెట్లను ఎస్‌వీబీ వైఫల్యం మరింతి కుంగదీసిందనే చెప్పాలి. భారతీయ క్యాపిటల్ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్‌వీబీ పతనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులను భారతీయ క్యాపిటల్ మార్కెట్లో ధైర్యంగా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎస్‌వీబీ బాటలో మరిన్ని బ్యాంక్‌లు మూతబడుతాయని ఊహాగానాల నేపథ్యంలో విదేశీపెట్టుబడిదారులు వెనకగడుగు వేస్తున్నారు. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని నిణుపులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడి తగ్గుదలకి దారితీసింది.