ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు
అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం దాని పెరుగుదలను కొనసాగిస్తోంది. నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవలి నివేదికలో మొత్తంగా, కోవిడ్ తర్వాత ఆర్థిక పునరుద్ధరణ ఉండచ్చని పేర్కొంది, కానీ అలా జరగలేదు. భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 6.5 శాతానికి చేరుకుంది. డిసెంబర్‌లో 5.72 శాతం, నవంబర్‌లో 5.88శాతం. గత సంవత్సరం HIFY23లో భారతదేశ ద్రవ్యోల్బణం సగటు 7.2 శాతంగా ఉంది
అధిక ఇన్‌పుట్ ధరలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయంతో వివిధ రంగాలలో కంపెనీలు ధరలను పెంచాయి
గత రెండేళ్లలో 5.8 శాతం అధిక ఇన్‌పుట్ ధరలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయంతో వివిధ రంగాలలో కంపెనీలు ధరలను పెంచాయి. ఫలితంగా, భారతదేశం అంతటా ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల పొదుపులు దెబ్బతింటున్నాయి. టెలికాం, ఆటో, ఇంధనం, FMCG వంటి ముఖ్యమైన వాటితో సహా వివిధ రంగాల్లోని వస్తువుల అధిక ధరలు వినియోగదారులు జేబులకు చిల్లు పెట్టాయి. HH నికర ఆర్థిక పొదుపులు (NFS) 2022 ఆర్ధిక సంవత్సరంలో GDPలో 7.3 శాతం, 2021 ఆర్ధిక సంవత్సరంలో GDPలో 12.0% నుండి IHFY23లో GDPలో 4.0 శాతానికి మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని లెక్కలు సూచిస్తున్నాయని ఒక నివేదికలో పేర్కొంది. రైతుల వాణిజ్య నిబంధనలు క్షీణించాయి, వ్యవసాయ ఎగుమతులు కూడా తగ్గాయి.