LOADING...
SoftBank: ఇంటెల్‌లో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడి.. 6వ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా జపాన్ దిగ్గజం
6వ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా జపాన్ దిగ్గజం

SoftBank: ఇంటెల్‌లో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడి.. 6వ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా జపాన్ దిగ్గజం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో సాఫ్ట్‌బ్యాంక్, ఇంటెల్‌లో సుమారు 2% వాటాను సాధించగా, దాంతో కంపెనీలో 6వ అతిపెద్ద షేర్‌హోల్డర్గా నిలిచింది. ఒక్కో షేర్‌ను 23 డాలర్ల రేటుకు కొనుగోలు చేసినట్లు ఇరువురు సంస్థలు ధృవీకరించాయి. బోర్డు సీటు లేదా చిప్ కొనుగోలు ఒప్పందాలు లేకపోయినా, ఈ పెట్టుబడి ద్వారా అమెరికా సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి సోఫ్ట్‌బ్యాంక్ మద్దతు లభిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

వ్యూహాత్మక మద్దతు 

చిప్ తయారీ సామర్థ్యానికి బలమైన మద్దతు 

ఈ పెట్టుబడి వార్త వెలువడిన వెంటనే, మంగళవారం సాఫ్ట్‌బ్యాంక్ షేర్లు 5% కంటే ఎక్కువగా పడిపోగా, ఇంటెల్ షేర్లు మాత్రం ఆఫ్టర్-మార్కెట్ ట్రేడింగ్‌లో 5.6% మేర పెరిగాయి. ఇప్పటికే ఇంటెల్, బయటి కస్టమర్ల కోసం చిప్‌లను తయారు చేయాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, సోఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి పెద్ద ఊతమిచ్చినట్లైంది. మాజీ సీఈఓ కాలంలోనే ఈ ప్రాజెక్ట్ కోసం ఇంటెల్ బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. అయితే, కొత్త సీఈఓ లిప్-బు టాన్ కంపెనీ పనితీరును స్థిరపరిచేందుకు, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అతిగా ఉన్న ప్రణాళికలను కొంతవరకు తగ్గించారు.

స్పష్టీకరణ 

అమెరికా ప్రభుత్వ వాటా ఊహాగానాలకు తెరపడింది 

ఇంటెల్‌లో అమెరికా ప్రభుత్వం వాటా కొనుగోలు చేస్తుందని మీడియాలో వచ్చిన వార్తలకు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా కంపెనీలతో సంబంధాల కారణంగా టాన్ రాజీనామా చేయాలని చేసిన డిమాండ్‌తో కూడా సంబంధం లేనిదే. ఈ అంశంపై వైట్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

పెట్టుబడి 

2025లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడుల వర్షం 

ఇంటెల్‌లో ఈ పెట్టుబడి, 2025లో సాఫ్ట్‌బ్యాంక్ వరుసగా చేస్తున్న భారీ పెట్టుబడి ప్రకటనలలో ఒక భాగం. వీటిలో చాట్‌జీపీటీ వెనుక ఉన్న సంస్థ 'ఓపెన్‌ఏఐ'లో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి,అమెరికాలో 500 బిలియన్ డాలర్ల 'స్టార్‌గేట్' డేటా సెంటర్ ప్రాజెక్ట్కు నిధులు సమకూర్చడం ఉన్నాయి. అంతేకాకుండా, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కూడా అమెరికా ఒహియోలోని తన పాత ఎలక్ట్రిక్ వాహన ఫ్యాక్టరీలో సాఫ్ట్‌బ్యాంక్‌తో కలిసి డేటా సెంటర్ పరికరాల తయారీ చేయాలని ప్రణాళికలు ప్రకటించింది.