Brian Niccol: 'మీరు ఖచ్చితంగా నమ్మాలి'.. స్టార్‌బక్స్ కొత్త సీఈఓ కెరియర్ టిప్
ప్రఖ్యాత కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks)కు తాజాగా బ్రియాన్ నికోల్ (50 ఏళ్లు) సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. స్టార్‌బక్స్‌కు అతిపెద్ద మార్కెట్లైన అమెరికా, చైనాలో అమ్మకాలు తగ్గడంపై భయాందోళనలు నెలకొనడం, అలాగే పెట్టుబడిదారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో అనుభవజ్ఞుడైన బ్రియాన్ నికోల్ బాధ్యతలు స్వీకరించడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఆయనపై పడింది. నికోల్ తన కెరియర్ ప్రారంభంలో పాటించిన సూత్రాలను గురించి ఇటీవల ఓ స్పీచ్ ఇచ్చారు, ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదల వీడకూడదు
ఈ ఏడాది మేలో మియామీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన నికోల్, తన కెరియర్‌లో అనుసరించిన సూత్రాల గురించి వివరించారు. ''నిజంగా మీను నమ్మండి. ఇది చాలా పాత సలహా కానీ, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ ప్రయాణం ప్రారంభంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదల వీడకూడదు. లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. మీరు చేయగలరని నమ్మండి'' అని తెలిపారు. తన పురోగతిని పర్యవేక్షించడానికి, నికోల్ ఎప్పుడూ తనతో ఓ నోట్‌బుక్ తీసుకెళ్లుతారు. అందులో తన సాధనలను రాస్తారు. యువత తన శక్తి,సామర్థ్యాన్ని విశ్వసిస్తూ ముందుకుసాగాలని సూచించారు. సామర్థ్యంపై నమ్మకం ఉంచడం వల్లే తన కెరియర్‌లో అనేక మార్పులు వచ్చాయని నికోల్ చెప్పారు.
స్టార్‌బక్స్ సీఈఓగా గతంలో భారత సంతతికి చెందిన వ్యక్తి
ఈ క్రమంలో, స్టార్‌బక్స్ మాజీ ఛైర్మన్ మెలోడీ, నికోల్ గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కంపెనీని వృద్ధి పథంలో నడిపించేందుకు ఏమి చేయాలో నాకు తెలుసు అని నికోల్ చెప్పారని చెప్పారు. ఇది కంపెనీ చరిత్రలో ఒక స్పీడ్‌బప్ మాత్రమే. దీన్ని ఎదుర్కొనేందుకు నాకు భయం లేదు, ఎందుకంటే బోర్డు సభ్యులు చాలా ప్రోత్సాహకంగా ఉన్నారని చెప్పారు. గతంలో, భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఈ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు ఆయన స్థానంలో బ్రియాన్ నికోల్ నియమించబడ్డారు.