Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,119
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, కొంతసేపటికి నష్టాల్లోకి మళ్లాయి.
రోజంతా హెచ్చుతగ్గులను ఎదుర్కొన్న సూచీలు, చివరికి స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రముఖ స్టాక్స్‌లో అమ్మకాలు జరగడం సూచీలను ప్రభావితం చేసింది.
రంగాల వారీగా పరిశీలిస్తే, ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. అయితే, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.42 డాలర్లు
సెన్సెక్స్ ఉదయం 73,427.65 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 73,198.10) లాభాల్లో ప్రారంభమైనప్పటికీ,తరువాత నష్టాల్లోకి జారుకుంది.
ఇంట్రాడేలో 73,198.10 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ,చివరికి 112.16 పాయింట్ల నష్టంతో 73,085.94 వద్ద ముగిసింది.
నిఫ్టీ 5.40 పాయింట్లు నష్టపోయి 22,119.30 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 87.35 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోగా,అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.42 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2877 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.