
Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
చాలా కాలం తర్వాత స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్‌లు పుంజుకోవడం సూచీలకు అనుకూలంగా మారింది.
గతంలో విక్రయదారులుగా వ్యవహరించిన విదేశీ సంస్థాగత మదుపర్లు మళ్లీ కొనుగోళ్లను ప్రారంభించడం మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చింది.
సెన్సెక్స్ ఉదయం 76,155.00 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,348.06)స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది.
76,095.26 వద్ద కనిష్ఠాన్ని తాకిన తరువాత, లాభ-నష్టాల మధ్య కదలాడింది.మొదట నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, ప్రధాన షేర్ల మద్దతుతో తిరిగి లాభాల్లోకి మారింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో 77,041.94వద్ద గరిష్ఠాన్ని చేరుకున్న సెన్సెక్స్,చివరకు 557పాయింట్ల లాభంతో 76,905.51 వద్ద ముగిసింది.
వివరాలు
లాభాలు. నష్టాలు
నిఫ్టీ పరంగా చూస్తే , ఇంట్రాడేలో 23,402.70 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 159 పాయింట్ల లాభంతో 23,350.40 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
అయితే, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇతర మార్కెట్ అంశాలు
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.99 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 71.76డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3,039 డాలర్ల వద్ద కొనసాగుతోంది.