Page Loader
stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం రోజంతా ఊగిసలాడిన తర్వాత స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలో సూచీలు తీవ్ర నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, తర్వాత కొంత మేరకు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 77.26 పాయింట్లు పడిపోయి 81,373 వద్ద స్థిరమయ్యింది. నిఫ్టీ కూడా 34.10 పాయింట్లు తగ్గి 24,716.60 వద్ద ట్రేడింగ్ ముగించింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 85.38గా నమోదు 

నిఫ్టీలో ముఖ్యంగా అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్, టాటా కన్స్యూమర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టాల పాలయ్యాయి. రంగాల వారీగా చూస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU Banks) రియాల్టీ రంగ సూచీలు లాభాలు నమోదు చేయగా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మెటల్ రంగ సూచీలు సుమారుగా 0.5 శాతం వరకూ తగ్గిపోయాయి. అంతేకాక, డాలరుతో రూపాయి మారకం విలువ 85.38గా నమోదైంది.