Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల ధోరణి కొనసాగుతోంది.వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి.
ఒక దశలో సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.సెన్సెక్స్ 76,000,నిఫ్టీ 23,000 దిగువకు చేరాయి.
అయితే, సూచీలు తిరిగి బలంగా పుంజుకోవడం, స్వల్ప నష్టాలకే పరిమితం కావడం మదుపర్లకు కొంత ఊరటనిచ్చింది.
రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా,ఐటీసీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా,హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ,కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి.
సెన్సెక్స్ ఉదయం 76,188.24 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,293.60) నష్టాలతో ప్రారంభమైంది.
రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులు ఎదుర్కొంది.ఒక దశలో దాదాపు 900పాయింట్ల నష్టంతో 75,388.39 కనిష్ఠ స్థాయికి చేరిన సూచీ, మళ్లీ బలంగా పుంజుకొని 76,459 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్లు
చివరికి 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 86.88 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర కొంత తగ్గి 2910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.