Page Loader
Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. రెండేళ్ల తర్వాత ఈ వారమే అతి పెద్ద భారీ పతనం
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. రెండేళ్ల తర్వాత ఈ వారమే అతి పెద్ద భారీ పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం భారీ నష్టాలతో ముగిసింది. ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాంతో, ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. వారం చివరలో మెరుపులు కనిపిస్తాయనుకున్నా, రోజంతా ఒడిదుడుకుల మధ్య మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. గత రెండేళ్లలో ఇంత భారీ నష్టం చూడటం ఈ వారానికి సంబంధించిన విశేషం. 2022 జూన్ తర్వాత ఇదే అతి పెద్ద పతనం అని నిపుణులు తెలిపారు.

వివరాలు 

బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2 శాతం పైగా నష్టం 

శుక్రవారం మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 1,176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద స్థిరపడి, నిఫ్టీ 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద ముగిసింది. నిఫ్టీలో అధిక నష్టాలను అనుభవించిన స్టాక్‌లలో ట్రెంట్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. లాభం చేసిన వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. రియాల్టీ ఇండెక్స్ 4 శాతం, ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, టెలికాం, పిఎస్‌యు బ్యాంక్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఈనిలా అన్ని రంగాలు నష్టాల పాలయ్యాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2 శాతం పైగా నష్టపోయాయి.