NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు 
    తదుపరి వార్తా కథనం
    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు 
    ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు

    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

    భారత ఈక్విటీ మార్కెట్లు కూడా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి.

    ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాలతో కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 1,264.2 పాయింట్లు పతనమై 83,002.09 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ-50 సూచీ 345.3 పాయింట్లు దిగజారి 25,451.60 వద్ద ప్రారంభమైంది.

    ఉదయం 11 గంటల సమయానికి, సెన్సెక్స్ కాస్త కోలుకొని 954.50 పాయింట్లు (1.13%) నష్టంతో 83,311.69 వద్ద కదలాడుతోంది.

    ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 11 గంటల సమయానికి 295.80 పాయింట్లు (1.15%) నష్టపోయి 25,501.00 వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు

    మధ్య ఆసియాలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా, అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మార్చాయి.

    ఈ నేపథ్యంలో, మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు మొగ్గుచూపారు.

    చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్, ఇతర రంగాల్లో అమ్మకాల జోరు కనిపిస్తోంది.

    ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి.

    బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి, అయితే బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. జపనీస్ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    స్టాక్ మార్కెట్

    ఈఎంఎస్‌ షేర్లకు భలే గిరాకీ.. ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం షేర్ విలువ
    ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు   షేర్ విలువ
    భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ అదానీ గ్రూప్
    Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025