Stock Market: స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, దేశీయంగా ప్రభావం చూపే కీలక వార్తలు లేనందువల్ల మార్కెట్లు స్తబ్దంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 81,928 వద్ద, నిఫ్టీ 51.5 పాయింట్లు తగ్గి 24,716 వద్ద ట్రేడవుతున్నాయి. లార్సెన్ & టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభాయి.
నష్టాల్లో అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్ కంపెనీలు
అపోలో హాస్పిటల్స్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 84.83 వద్ద స్థిరంగా ఉంది. ఈ బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన సమావేశ ఫలితాలు వెలువడనున్నాయి. దీనిపై మార్కెట్ల దృష్టి నిలిచింది. ఈ నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.