తదుపరి వార్తా కథనం
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 21, 2025
03:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో శుక్రవారం ఉదయం సూచీలు స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి.
చివరికి మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది.ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఈ వారం కోట్లాది రూపాయల సంపద నష్టమైంది.
సెన్సెక్స్ 424 పాయింట్లు కోల్పోయి 75,311 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 22,795 వద్ద ముగిసింది.
ప్రధాన సూచీల్లో 12 రంగాలు నష్టపోయాయి, అయితే నిఫ్టీ మెటల్ ఒక్కదానే 1% పైగా లాభపడింది.
ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై సుంకాన్ని110% నుంచి 15%కి తగ్గించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో నిఫ్టీ ఆటో 2.5% తగ్గింది.
టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది.