LOADING...
stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయంతో పాటు గత వారం నష్టాల నుంచి పునరుద్ధరణ కొనసాగడంతో సూచీలు ఊరట చూపించాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 1,261 పాయింట్ల పెరుగుదలతో 80,378 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 397.5 పాయింట్లు పెరిగి 24,305 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

లాభాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు

సెన్సెక్స్‌ 30లో లార్సెన్‌, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ వంటి ప్రధాన కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే, జేఎస్‌డబ్ల్యూ, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం కొద్దిపాటి నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 84.35 వద్ద ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. గత వారం గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు నేపథ్యంలో పతనమైన ఈ స్టాక్ ఈరోజు కొంతమేరకు కోలుకుంది.