
Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా ఈ వారం నష్టాలతో ఆరంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 539 పాయింట్లు పడిపోయి 74,771 వద్ద ఉండగా, నిఫ్టీ (Nifty) 164 పాయింట్లు తగ్గి 22,631 వద్ద నిలిచింది.
అమెరికా టారిఫ్ భయాలతో పాటు దేశీయంగా కార్పొరేట్ సంస్థల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, షేర్ల అధిక విలువలు, జీడీపీ వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిస్థితులు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.58
నిఫ్టీ సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, సిప్లా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఓఎన్‌జీసీ స్టాక్స్ నష్టాలతో మొదలయ్యాయి.
ట్రంప్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు దేశీయ ఐటీ కంపెనీలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.58 వద్ద కొనసాగుతోంది.