LOADING...
Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..నిఫ్టీ @ 24,947
స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..నిఫ్టీ @ 24,947

Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..నిఫ్టీ @ 24,947

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 108 పాయింట్లు క్షీణించి 81,536 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పడిపోయి 24,947 వద్ద కొనసాగుతున్నాయి. స్టాక్‌ల విషయానికి వస్తే, గెలాక్సీ సర్ఫాక్ట, పీఎన్‌ గాడ్గిల్‌ జ్యువెలర్స్‌, మాక్స్‌ ఎస్టేట్‌, లాయిడ్స్‌ మెటల్స్‌ లాభదాయక స్థితిలో ఉండగా, నజరా టెక్నాలజీస్‌, డెల్టాకార్ప్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ మాత్రం నష్టాల్లో కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేయడంతో, కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను బుక్‌ చేసుకోవడానికి మొగ్గు చూపారు.

వివరాలు 

ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌లలో మిశ్రమ పరిస్థితులు

ఇక కరెన్సీ మార్కెట్‌లో రూపాయి విలువ కూడా బలహీనంగా మొదలైంది. మంగళవారం రూ.86.95 వద్ద ముగిసిన రూపాయి, బుధవారం 21 పైసలు తగ్గి రూ.87.16 వద్ద ప్రారంభమైంది. ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌లలో కూడా మిశ్రమ పరిస్థితులు కనిపించాయి. ఆస్ట్రేలియా ఏసీఎక్స్‌ 200, న్యూజిలాండ్‌ ఎన్‌జెడ్‌ఎక్స్‌ 50 సూచీలు తప్ప మిగిలిన ప్రధాన సూచీలు క్షీణించాయి. ముఖ్యంగా చైనాకు చెందిన షాంఘై సూచీ, జపాన్‌ నిక్కీ, హాంకాంగ్‌ హెచ్‌ఎస్‌ఐ, దక్షిణ కొరియా కోస్పి, తైవాన్‌ సూచీలు గణనీయమైన పతనాన్ని నమోదు చేశాయి.