Page Loader
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా సాగుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ 280 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,000 పాయింట్లకు ఎగువన కొనసాగింది. ముఖ్యంగా, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మదుపర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 9:30 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 274 పాయింట్లు పెరిగి 76,068 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 23,015 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, జొమాటో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 77.31 డాలర్లు 

అయితే, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 77.31 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,770.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా పతనమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం పాక్షికంగా కోలుకున్నాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.4,921 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,814 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.