Page Loader
Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ 
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్

Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ 

వ్రాసిన వారు Stalin
May 21, 2024
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు(Stock Market)మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, విప్రో, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

Details 

 మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం మిశ్రమంగా ముగిశాయి.ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్‌లో నికరంగా రూ.93 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.153 కోట్ల వాటాలను అమ్మేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.